కెసిఆర్! ఖబడ్దార్, తెరాస చిల్లర పార్టీ: చంద్రబాబు

Chandrababu Naidu
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా పరకాలలో జరిగిన సభలో రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదని, అది మీకు, మీ పార్టీకి క్షేమం కాదని ఆయన కెసిఆర్‌ను హెచ్చరించారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా, సిగ్గులేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.

వైఖరిని చెప్పుకోవడం తప్పేమీ కాదని, దాని కోసం తన పాదయాత్రను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము లేఖ ఇవ్వడంతో తెరాస గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, తెలంగాణలో ఉనికిని కోల్పోతామని భయపడుతోందని, అందుకే పాదయాత్రలో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. పెత్తందార్లు, భూస్వాముల పార్టీగా తెరాసను అభివర్ణించారు. సిద్ధాంతాలను వదిలేసి తెరాస చిల్లర పార్టీగా కొనసాగుతుందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ విధానంపై చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. అంతకుముందు - వరంగల్ జిల్లా ఇస్సిపేట వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. రంగాపురం, నాగారం గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రైతాంగానికి విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు.

తమ హయాంలో రైతులకు 20 వేల కోట్ల రూపాయల రాయితీ ప్రకటించామని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేశామని, దీనికి భిన్నంగా కిరణ్ ప్రభుత్వం రైతాంగంపై రూ.6,500 కోట్ల సర్‌చార్జీలను మోపిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అసమర్థ విధానాలతో విద్యుత్ సరఫరా విధానం లోపభూయిష్టంగా మారిందని, కరెంట్ బిల్లులు బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంటి బిల్లు చెల్లించలేకపోతే వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొండా మురళి, సురేఖ దంపతులపై వరసగా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రామానికొక కీచకుడు..నియోజక వర్గానికొక మాఫియా లీడరును వైయస్ తన పాలనలో తయారుచేశారని ఆయన అన్నారు. పెంట్రోల్ బంకులూ వారికే..భార్యాభర్తలు మధ్య పంచాయితీ వస్తే, ఆ సెటిల్‌మెంట్లు వారే చేస్తారని, దేన్నీ వదిలిపెట్టరని ఆయన అన్నారు. కాగా, పరకాల మండలం లక్ష్మీపురంలో కొందరు మహిళలు - చంద్రబాబు సమక్షంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+