వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌వైపు వెళ్లే బ్రోకర్లు: ఉత్తమ్, చిరుకోసం ఎగబడ్డ జనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttam Kumar Reddy
నల్గొండ: పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడిన వారు తనపై అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కొందరు మైకు దొరకగానే తెలంగాణ అనడం పరిపాటి అయిపోయిందని ధ్వజమెత్తారు.

వారు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అంటున్నారని కానీ, తాను మాత్రం ఎక్కడ మాట్లాడితే తెలంగాణ వస్తుందే అక్కడే మాట్లాడుతానని చెప్పారు. జగన్‌తో వెళ్లేందుకు సిద్ధమైన వారు తెలంగాణవాదులు అవుతారా అని ప్రశ్నించారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు వారు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తన కంటే ప్రతిభ, అర్హత గల నేతలు ఎవరూ లేరన్నారు. బ్రోకర్లు, కొందరు నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన నిప్పులు చెరిగారు.

తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదన్నారు. తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టులు పొంది డబ్బులు సంపాదించిన వారికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకొని తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. అలాంటి వారిని నల్గొండ జిల్లా ప్రజలు నమ్మరన్నారు.

చిరంజీవిను చూసేందుకు ఎగబడ్డ జనం

హుజూర్ నగర్ ప్రగతి ఉత్సవాలకు కేంద్రమంత్రి చిరంజీవి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు వచ్చారు. ప్రగతి ఉత్సవాలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు జనం ఎగబడ్డారు. చిరు కోసం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు.

కాగా రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తన భిక్షతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడిన కేంద్రమంత్రి చిరంజీవిని జిల్లాకు ఆహ్వానించడమేమిటని ప్రశ్నించారు. మంత్రులంతా పనికి రాని వారని, వారు పదవులకు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు.

English summary
Minister Uttam Kumar Reddy said on Tuesday that he is condemning brokers comments on him. He was indirectly lashed out at former minister Komatireddy Venkat Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X