రహస్య కుట్ర, 51కోట్లు స్వాధీనం: జగన్ అటాచ్‌పై ఈడి

సిబిఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జీషీటు ఆధారంగా ఆస్తుల అటాచ్‌ను చేశామని ఈడి వాదించింది. జనని, జగతిలకు ఫార్మా కంపెనీల నుండి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ కుట్ర అంతా రహస్యంగా జరిగిందని తెలిపింది. ఆస్తుల అటాచ్ ప్రాథమిక చర్య మాత్రమేనని తెలిపింది. అయితే నేరారోపణకు మించి ఆస్తులు అటాచ్ ఎలా చేస్తారని జగన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. ఈడి, హెటిరో, అరబిందో, ట్రైడెంట్ వంటి కంపెనీలు 21.5 కోట్ల లబ్ధిని పొందాయని, ప్రతిగా జనని, జగతిలో 29.5 కోట్లు పెట్టుబడులు పెట్టాయని ఈడి బలమైన వాదన వినిపించింది.
ఐదు కంపెనీలకు సంబంధించి తాము రూ.51 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పూర్తిగా క్విడ్ ప్రోకో లావాదేవీలని విచారణలో తేలిందన్నారు. మరికొన్ని ఆస్తులను జప్తు చేయాల్సి ఉందని చెప్పారు. వాదనలు గంటన్నర పాటు సాగాయి. ఈడి, హెటెరో, ట్రైడెంట్, అరబిందో, ఎబిఎల్, జనని, జగతిలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.












Click it and Unblock the Notifications