నాకు ఆశ్చర్యం కలగలేదు, 63 ఏళ్ల యోధుడు: లోకేష్

Nara lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురువారం తన తండ్రి వస్తున్నా మీకోసం రికార్డ్ పాదయాత్ర పైన ట్వీట్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఆయన గురువారం 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. పలు సందర్భాలలో ట్వీట్స్ చేస్తున్న నారా లోకేష్ తన తండ్రి మైలు రాయి పైన కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

తన తండ్రి 63 ఏళ్ల వయస్సులో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం పట్ల కొందరు ఆశ్చర్యపోయారని, కానీ తనకు మాత్రం ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ప్రజల పట్ల తన తండ్రి నిబద్దత, చిత్తశుద్ది ఈ పాదయాత్ర తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. అరవై మూడేళ్ల వయస్సులో ప్రజల కోసం పరితపిస్తున్న పోరాట యోధుడి(చంద్రబాబు)కి సెల్యూట్ చేయాలన్నారు.

కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డ్ పాదయాత్రను అధిగమించిన విషయం తెలిసిందే. దివంగత వైయస్ 2003లో 1468 కిలోమీటర్లు నడిచారు. చంద్రబాబు దానిని అధిగమించారు. గురువారం నాటికి ఆయన 1500 కిలోమీటర్లు పూర్తి చేశారు.

వైయస్ పాదయాత్ర 33 నియోజకవర్గాల్లో కొనసాగగా.. బాబు యాత్ర 40 నియోజకవర్గాలు పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 1500 కిలోమీటర్లు దాటినందున సంగెం మండలం పల్లారుగూడ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పాదయాత్ర పైన అప్పుడప్పుడు లోకేష్ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+