అక్బరుద్దీన్: 'పెదవి విప్పని జగన్ పార్టీ x దిగజారొద్దు'

అక్బరుద్దీన్ అంశాన్ని జగన్ పార్టీ ఖండించలేదని, ఎందుకు ఖండించలేదో చెప్పాలని ఆయన అన్నారు. మజ్లిస్ లాగే జగన్ పార్టీ కూడ మతపార్టీయే అన్నారు. గతంలో దేవాలయాల్లో, మసీదులలో, చర్చిలలో తమ రాజకీయ పార్టీ కోసం పూజలు, ప్రార్థనలు అంటూ ఎవరూ చేయించలేదని కానీ, వైయస్సార్ కాంగ్రెసు మాత్రం జగన్ కోసం చర్చిల్లో ప్రార్థనలు చేయించిందని గుర్తు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ చేతుల్లో పట్టుకొని వెళ్లడమెందుకని ప్రశ్నించారు.
అక్బరుద్దీన్ కంటే తన మాటలు ఎక్కువగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, దానిని బట్టే అతని వైఖరి ఏమిటో తెలుస్తోందన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఓవైసీ, క్రైస్తవ ఓట్ల కోసం జగన్ వల వేస్తున్నారన్నారు. ఇద్దరు రెండు మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అందుకు జగన్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... తమది సెక్యులర్ పార్టీ అని, అక్బరుద్దీన్ ఘటనపై తమకు తెలిసినందు వల్లే ఈ రోజు స్పందించామన్నారు.
సోమిరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడవద్దన్నారు. తాము నిన్న రాత్రి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చూశామన్నారు. అక్బరుద్దీన్‌తో పాటు సోమిరెడ్డి పైన కూడా కేసు పెట్టాలన్నారు. అక్బరుద్దీన్ అంశంపై అన్ని పార్టీలు స్పందించాయని.. కాని సోమిరెడ్డి చెప్పినట్లుగా జగన్ పార్టీ మాత్రం స్పందించలేదని బిజెపి నేత లక్ష్మణ్ అన్నారు.












Click it and Unblock the Notifications