బైక్ నడిపిన రాములమ్మ: జగ్గారెడ్డిపై నాయిని ఫైర్

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడారు. తెలంగాణ కోసం ప్యాకేజీలు ఇచ్చినా మీడియాకు లీకేజీలు ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాల్సిందే అన్నారు. అది ఇస్తేనే రెండు ప్రాంతాలకు కాంగ్రెసు న్యాయం చేసినట్లవుతుందన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే కాంగ్రెసు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలన్నారు.
బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. ఎలాగైనా రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి ద్విచక్రవాహనం(బైక్) నడిపి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ఆమె తెలంగాణ భవన్ నుండి కొద్ది దూరం వాహనాన్ని నడిపారు. కాగా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు.
జగ్గారెడ్డిపై నాయిని ఫైర్
అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని చెప్పని తెలుగుదేశం పార్టీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎలా సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదని మరో నేత నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలమని అఖిల పక్ష మినిట్స్‌లో ఉంటే నారాయణ చూపించాలన్నారు.
ఈ నెల 26 తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెసు పార్టీపై ఒత్తిడి తెస్తామన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సరికాదని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అలాగే జగ్గారెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన తప్పు పట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications