జగన్ అవినీతిని నిరూపించే దమ్ముందా?: విజయమ్మ

YS Vijayamma
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం అన్నారు. మంచం కింద కోట్లు దాచిన కేంద్రమంత్రి చిరంజీవి పైన, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబు పైన కేసులు పెట్టరని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డారంటూ గోబెల్స్ ప్రచారం చేసి తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ అవినీతిని నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ చేశారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులో గురువారం విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపిపి అధ్యక్షుడు గూడెం మహిపాల్‌ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు. వైయస్ జగన్ ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టిడిపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.

తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా జగన్ ఏనాడు క్యాంప్ కార్యాలయంలోగాని, సచివాలయంలోగానీ వెళ్లలేదన్నారు. ఏ చిన్న పదవి కూడా జగన్‌కు లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర శూన్యమని తెలిసినా అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్నారు. కాంగ్రెస్‌ను వీడిన రెండో రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. చంద్రబాబు మోసపూరిత పాదయాత్రలు చేస్తూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని విజయమ్మ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చలువే అన్నారు.

జగన్‌పై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆయన చరిత్ర గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రహేజా, ఐఎంజీ, గోల్ఫ్‌కోర్టు, ఎమ్మార్ తదితర సంస్థలకు చేసిన భూసంతర్పణలో బాబు పెద్ద ఎత్తున వెనకేసుకున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో ఊదరకొట్టిన చిరంజీవి తన పార్టీని అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను అడ్డుకుని 224రోజుల పాటు జగన్‌ను జైల్లో పెట్టడం అన్యాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+