దావూద్ లింక్: మియాందాద్ భారత పర్యటన రద్దు

మియాందాద్ భారత పర్యటన రద్దయినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. క్రికెట్‌పై కాకుండా ఇతర విషయాలపైకి దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతో మియాందాద్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మియాందాద్‌కు వీసాను నిరాకరించిన భారత ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం వీసాను మంజూరు చేసింది.
మియాందాద్‌కు వీసా మంజూరు చేయడాన్ని బిజెపి, శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దావూద్‌కు సంబంధించిన వ్యక్తికి వీసా ఇవ్వడం ద్వారా భారత, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా మెరుగుపడతాయో చెప్పాలని డిమాండ్ చేశాయి. నాలుగు కెటగిరీల వ్యక్తులకు వీసాలు మంజూరు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం చెప్పారు. మ్యాచు చూడడానికి వచ్చి రిటర్న్ టికెట్ కూడా తీసుకున్నవారికి, ఆటగాళ్లకు, పిసిబిలో ఉన్నవారికి వీసాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు.
మియాందాద్ ప్రసిద్ధమైన క్రికెటర్ అని, మియాందాద్ దరఖాస్తు పత్రాలు పద్ధతిగా ఉన్నాయని, అందువల్లనే వీసా మంజారు చేశామని హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications