అక్బరుద్దీన్ చుట్టూ ఉచ్చు: మరో రెండు కేసులు

ఇదిలావుంటే, అక్బరుద్దీన్ విచారణకు హాజరు కావాల్సిందేనని డిజిపి దినేష్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ విషయాన్ని విచారణాధికారి చూసుకుంటారని ఆయన సోమవారం అన్నారు. కాగా, అక్బరుద్దీన్ నిజామాబాద్ వచ్చే రోజున బంద్ పాటించాలని బిజెపి శానససభ్యుడు లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగానికి నిరసనగా రేపు (మంగళవారం) నిరశన దీక్షలు చేయనున్నట్లు ఆయన సోమవారం చెప్పారు. అక్బరుద్దీన్ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అక్బరుద్దీన్ ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు వైద్యులను పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్బరుద్దీన్ ద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్‌లో బిజెపి ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నిర్మల్ నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులను పాతబస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రామనాథం సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాదులోని లాల్‌దర్వాజలో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు, కార్యకర్తలు దగ్దం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేయాలంటూ మొజంజాఫీ మార్కెట్ వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అక్బరుద్దీన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి జరిపారు. దత్తాత్రేయ సహా పలువురిని అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆందోళన జరిగింది.












Click it and Unblock the Notifications