కోమటిలంక రోడ్డు: కావూరి సాంబశివ రావుపై కేసు

దీంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు కొల్లేటి గట్టుపై నిర్మాణాలు నిషేధం. అయితే ఏటిగట్టు పైన గ్రావెల్ వేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో పలుగు, పారా పట్టుకొని కావూరి రోడ్డు వేసే ప్రయత్నాలు చేసారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాక నుండి కొల్లేరు గట్టు మీదుగా కోమటిలంకకు దారి వేసే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో కావూరి స్వల్ప అస్వస్థతకు కూడా గురయ్యారు. ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐదో కాంటూరి పరిధిలోని కోమటిలంకకు రహదారిపై ఈ వివాదం రాజుకుంది.
కాగా రహదారిని అధికారులు అడ్డుకున్న సమయంలో కావూరి మాట్లాడారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కైకలూరు మండలం ఆటపాకలోని పక్షుల కేంద్రం సమీపంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి రహదారి నిర్మాణాన్ని ఆదివారం రాత్రి కావూరి సమక్షంలో చేపట్టారు. 1999వ సంవత్సరంలో కొల్లేరు ఆపరేషన్ కోసం ప్రభుత్వం 120 జీవోను ప్రవేశపెట్టింది.
ఈ జీవోలో కొల్లేరు అభయారణ్య పరిధిలో రహదారులు ఉన్నవి ఉన్నట్లుగా మరమ్మతులు చేసుకోవచ్చునని జీవో నెం.6లో ప్రభుత్వం స్పష్టం చేసిందని, కావూరి తెలిపారు. ఫారెస్ట్ అధికారులు గత ఎనిమిది సంవత్సరాలుగా రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, ఎంత కాలం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఫారెస్ట్ సిబ్బందిపై ధ్వజమెత్తారు. శాంతియుతంగా రోడ్డు పనులు చేసుకోనివ్వాలని అధికారులను హెచ్చరించారు.
గ్రావెల్ పోసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. అధికారులు, కావూరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారితో ఫోన్‌లో చర్చించి ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులను జరగనివ్వాలంటూ కోరారు. ఆ అధికారి కూడా కొద్ది మేరకు వారించినప్పటికీ వినకుండా రోడ్డునిర్మాణ పనులను సాగించే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications