ప్రతి రోజూ ఎన్డీ తివారీ పితృత్వం కేసు విచారణ

రోజువారీ ప్రాతిపదికపై విచారణ చేయాలని హైకోర్టు స్థానిక కమిషనర్‌ను ఆదేశించింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవడాన్ని తిరస్కరిస్తున్నట్లు తివారీ తరరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన సాక్ష్యం పూర్తిగా సరైందని చెప్పలేమని, అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా లేమని తివారీ తరఫు న్యాయవాది చెప్పారు.
రోహిత్ శేఖర్ బయోలాజకల్ ఫాదర్ తివారీ అని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది. అదే వైద్యపరమైన సాక్ష్యం మాత్రమేనని తివారీ తరఫు న్యాయవాది అన్నారు. దాంతో కేసును రోజువారీ ప్రాతిపదికపై విచారించడానికి హైకోర్టు విమలా మాకెన్‌ను స్థానిక కమిషనర్‌గా నియమించింది.
తివారీ పితృత్వం కేసు విచారణను స్థానిక కమిషనర్ జనవరి 21వ తేదీన ప్రారంభిస్తారు. తన బయోలాజికల్ ఫాదర్ తివారీ అంటూ రోహిత్ శేఖర్ అనే యువకుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications