ఢిల్లీ రేప్ విక్టిమ్ కూడా దోషే: ఆసారాం బాపు వ్యాఖ్య

ఒక చేయితో చప్పట్లు కావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయని, బాధితురాలు వారిని సోదరులుగా సంబోధించి వేడుకుని ఉంటే ఆమె మర్యాద, జీవితం దక్కి ఉండేవని అన్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం వార్తలు వచ్చాయి. నిందితులకు కఠిన శిక్షలు కూడవని, చట్టం దుర్వ్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
చాలా చట్టాలు దుర్వ్వినియోగం అవుతున్నాయని, వరకట్నం వేధింపుల చట్టాన్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఆసారాం బాపు అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులను సోమవారం సాకేత్ జిల్లా కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు నిందితులను త్వరగా విచారించి, వారికి కఠినమైన శిక్షలు వేయాలని దేశమంతా డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆసారాం బాపు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలను రూపొందించాలని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications