హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ రేప్: ఎపికి సాక్ష్యాలు, కోర్టులో లాయరుకు ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi GangRape
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఢిల్లీలో బస్సులో అత్యాచారానికి గురై మృతి చెందిన యువతి కేసుకు సంబంధించిన కేసులో నిందితుల సాక్ష్యాధారాలను న్యూఢిల్లీ పోలీసులు హైదరాబాద్ తరలించారు. ఆధారాల శాస్త్రీయ విశ్లేషణ కోసం కేంద్ర ఫోరెన్సిక్ లేబోరేటరీకి ఢిల్లీ పోలీసులు వీటిని సోమవారం అప్పగించారు. రెండు బాక్సుల్లో రామాంతాపూరుకు ఢిల్లీ పోలీసులు సాక్ష్యాలను తీసుకు వచ్చారు. వీటిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి తిరిగి ఢిల్లీకి పంపించనున్నారు.

కోర్టులో నిందితులు.. లాయర్లను అడ్డుకున్న న్యాయవాదులు

వైద్య విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం సాకేత్ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో నిందితులు రాంసింగ్, ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు.

వారు చదివిన స్కూల్ పత్రాల ఆధారంగా ఆరో నిందితుడిని మైనర్‌గా గుర్తించి జూనైనల్ హోంలో ఉంచారు. ఆరో నిందితుడిని బాల నేరస్థుడిగా న్యాయస్థానం ముందు విచారణకు హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి వెయ్యి పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు.

దీనిని కోర్టు స్వీకరించింది. నిందితులపై అత్యాచారం, హత్యలతో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. కాగా ఈ రోజు నిందితులను కోర్టుకు పోలీసులు హాజరు పర్చిన తర్వాత వారి తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా న్యూఢిల్లీ అత్యాచార కేసు విచారణ అంశంపై మీడియా సంయమనం పాటించాలని సాకేత్ కోర్టు ఆదేశించింది.

మరోవైపు అత్యాచార ఘటన నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో కోర్టు హాలు కిక్కిరిసి పోయింది. దీంతో పోలీసులు ఇంతమంది ఉంటే నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. కోర్టులో నుండి కేసుకు సంబంధం లేనివారు వెళ్లిపోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కేసును రహస్యంగా విచారించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary
The Saket court witnessed chaos as the five men accused of rape and murder of 23-year-old woman, were produced before court. Bar association members created ruckus after two lawyers offered to defend the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X