బీహారీలే.. అలవాటు: గ్యాంగ్‌రేప్‌పై రాజ్‌థాకరేxలాలూ

రేపిస్టులంతా బీహార్ నుంచి వచ్చినవారేనన్న వాస్తవం గురించి నోరెత్తేవారే లేరన్నారు. వారి వల్లే రేప్ కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. అసలీ వ్యవస్థే కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. బీహార్‌లో మాత్రమే చేసుకునే ఛాత్ పూజను ముంబయిలో నిర్వహించడం వారి సంఖ్యాబలాన్ని చూపేందుకు మాత్రమేనని విమర్శించారు. బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై ఇప్పటికీ చాలా కేసులు పెట్టారన్నారు. ఢిల్లీ ఘటన ఆవేదనకు గురి చేసిందన్నారు.
లాలూ ప్రసాద్ ధ్వజం
రాజ్ థాకరే వ్యాఖ్యలపై ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులంతా బీహారీలే అని రాజ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడ నేరం జరిగినా అందుకు బీహారీలే కారణమని ఆరోపించడం ఆయనకు, ఆయన పరివార పార్టీ శివసేనకు అలవాటయిపోయిందన్నారు. లాలూ ఆదివారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు.
తమ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని రాజ్ మానుకోవాలన్నారు. భార్యాభర్తలపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా లాలూ ఖండించారు. ఢిల్లీ యువతిపై అత్యాచారానికి వలస వచ్చిన బీహారీలే బాధ్యులంటే రాజ్ చేసిన వ్యాఖ్యలను రషీద్ అల్వీ ఖండించారు. మరోవైపు రాజ్ వ్యాఖ్యలపై ఆదివారం పాట్నాలో జెడియు ఎంపీ అలీ అన్వర్ అన్సారీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications