16ఏళ్ల అమ్మాయికి నిప్పు: యువకుడికి పేరెంట్స్ హెల్ప్

Youth, parents set 16-year-old girl ablaze after rape bid
అలహాబాద్: అలహాబాదులో దారుణం జరిగింది. పదహారేళ్ల అమ్మాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయికి నిప్పంటించడంలో యువకుడికి అతని తల్లిదండ్రులు సహకరించడం గమనార్హం. ఆ అమ్మాయి 70 శాతం కాలింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటన జనవరి 5వ తేదిన జరిగింది. పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

స్థానిక కార్యకర్త మంజు పాఠక్ పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఈ కేసు నమోదయినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడుగా జ్ఞాన్ పటేల్‌గా గుర్తించారు. ఇతని వయస్సు ఇరవై. శంకర్‌ఘర్ ప్రాంతంలోని బాధిత అమ్మాయి సోదరి నీళ్ల కోసం బయటకు వెళ్లిన సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లోంచి పొగలు వస్తుండటం చూసిన సోదరి తిరిగి పరుగెత్తుకొచ్చింది.

రక్షించాలంటూ అరిచారు. దీంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆమెను రక్షించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వారు నిందితుడు జ్ఞాన్ పటేల్, అతని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. బాధిత అమ్మాయి వాంగ్మూలాన్ని ఆసుపత్రిలో రికార్డ్ చేశారు. ఆమె తెలిపిన ప్రకారం... జ్ఞాన్ తొలుత ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అతనిని ఎదుర్కొంది.

వెంటనే అతను బయటకు వెళ్లి అతని తల్లిదండ్రులతో తిరిగి వచ్చాడు. వారు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. కేసు పెట్టవద్దని తనను వారు హెచ్చరించారని తెలిపింది. కాగా ఈ ఘటనపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

యువతిని అపహరించే కుట్ర

సికింద్రాబాదులోని నేరెడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో ఒక యువతిని అపహరించేందుకు ఓ జవాను ప్రయత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు జవాన్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఫ్రిజ్‌లో చిన్నారిని ఉంచిన దుండగుడు

రెండేళ్ల చిన్నారని చితక్కొట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు ఓ ఘనుడు. చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టడానికి గల కారణం వివాహేతర సంబంధమని తెలుస్తోంది. ఈ ఘటన రాజమండ్రిలోని నారాయణపురంలో జరిగింది. అతనిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+