నేనేమిటో చూపిస్తా, తెలంగాణ వస్తే అంతే: అసదుద్దీన్

Asaduddin
దరాబాద్: ఢిల్లీలోని తన నివాసంపై భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కార్యకర్తలు దాడి చేయడంపై మజ్లీస్ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తాను ఢిల్లీలో లేని సమయాన్ని చూసుకుని దాడి చేయడం కాదని, తాను ఢిల్లీ వచ్చిన తర్వాత వస్తే తానేమిటో, తన తడాఖా ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మతతత్వ శక్తులు రెచ్చిపోతాయని చెప్పడానికి గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలే తార్కాణమని ఆయన అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో కుట్రలు చేసి తమ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసినంత మాత్రాన మజ్లిస్ బలహీనపడదని అన్నారు. మరింత ప్రజా బలాన్ని కూడగట్టుకుని నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అక్బర్‌ను పోలీసులు అరెస్టు చేసి నిర్మల్‌కు తరలించిన తర్వాత ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కుట్రలకు పాల్పడుతున్నాయని, దానివల్లనే రెండు మూడు రోజులుగా తెలంగాణ జిల్లాల్లో అక్బరుద్దీన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో హిందువులు లేరా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తెలంగాణ వస్తే ఆర్ఎస్ఎస్, విహెచ్‌పీ, బిజెపి వంటి మత శక్తులు రెచ్చిపోయి ప్రవర్తించే ప్రమాదం ఉందని ఆరోపించారు. అక్బరుద్దీన్ అరెస్టును మజ్లిస్ చట్ట ప్రకారం ఎదుర్కొంటుందని చెప్పారు. కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+