జైలు మార్పుపై అక్బర్‌కు చుక్కెదురు: లంచ్‌లో రోటీ

పోలీసుల పిటిషన్ పైన రేపు కౌంటర్
అక్బరుద్దీన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్బరును విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని వారు కోరారు. దానిపై అక్బరుద్దీన్ తరఫు న్యాయవాదులు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కౌంటర్ దాఖలు తర్వాత ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం కస్టడీకి ఇవ్వడమా లేదా నిర్ణయించనుంది.
అక్బరు పైన మరిన్ని కేసులు
వివాదాస్పద కేసులో అక్బరుద్దీన్ పైన మరిన్న కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ త్రిపాఠి చెప్పారు. ఆయనపై అదనంగా 120(బి), 124(ఏ), 295(ఏ), 505, 188 ఐపిసి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరోవైపు అతనిని సాధారణ ఖైదీగానే చూస్తున్నామని కరీంనగర్ రేంజ్ డిఐజి భీమా నాయక్ చెప్పారు. అక్బరుకు అన్ని వైద్య సదుపాయాలు అదిలాబాదులోనే కల్పిస్తామన్నారు. ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరినట్లు చెప్పారు.
హైదరాబాదు, అదిలాబాద్, నిజామాబాదులో బందోబస్తు
అక్బరుద్దీన్ అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్, అదిలాబాద్, నిజామాబాద్‌లలోని సున్నిత ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు. నిర్మల్‌లో కోర్టు వద్ద ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులపై, జాతీయ మీడియా ఓబి వ్యాన్ల పైన మజ్లిస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కాగా ఉదయం పులిహోరను అక్బరు ఫలహారంగా తీసుకున్నారు. మధ్యాహ్నం రోటీ, మటన్ తీసుకున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications