హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'9': ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడుస్తున్న బాబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర బుధవారంతో వంద రోజులకు చేరుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదిన చంద్రబాబు తన పాదయాత్రను అనంతపురం జిల్లా హిందూపురం నుండి ప్రారంభించారు. నాటి నుండి ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు తన పాదయాత్రను అపలేదు. వంద రోజులకు చేరుకున్నందున చంద్రబాబు ఈ రోజు ఖమ్మం జిల్లా మాదిరిపురంలో కేక్ కూడ్ కట్ చేశారు.

పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన చిటికెన వేలికి అయిన గాయం ఇబ్బందులకు గురి చేసింది. ఆ తర్వా తీవ్ర కీళ్ల నొప్పులు. వీటన్నింటిని అధిగమించి బాబు యాత్రను కొనసాగిస్తున్నారు. యాధృచ్ఛికమో లేక మరేమో కానీ చంద్రబాబు పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న జనవరి 9వ తేదీనే 1983లో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు కూడా కావడం గమనార్హం.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

ఎన్టీఆర్ 29 మార్చి 1982న రాజకీయాల్లో సమరశంఖం పూరించారు. అది ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ 9 జనవరి 1983న ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

తాజాగా చంద్రబాబు పాదయాత్ర యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ సిఎంగా తొలిసారి పదవీ ప్రమాణం చేసిన రోజునే వస్తున్నా మీకోసం వంద రోజులకు చేరుకుంది.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లో కలిసిపోయారు.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

మూడోసారి టిడిపి ప్రతిపక్షానికి పరిమితం కాకుండా ఉండేందుకు ఇప్పుడు చంద్రబాబు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దూసుకెళుతున్నారు.

ఎన్టీఆర్ చేతికొచ్చిన వేళ చెమటోడ్చుతున్న బాబు

బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు.

ఎన్టీఆర్ 1982లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 29 మార్చి 1982లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. పార్టీని స్థాపించిన పదకొండు నెలల్లోనే అతను అధికారంలోకి వచ్చారు. నాదెండ్ల భాస్కర రావు కారణంగా 1984లో గద్దె దిగినా తిరిగి మళ్లీ ఎన్నికలకు వెళ్లి 1984లో రెండోసారి గెలిచారు. 1989లో ఓడినప్పటికీ 1994లో తిరిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అధికారం బాబు చేతికి వచ్చింది. అప్పటి నుండి చంద్రబాబు టిడిపిని లీడ్ చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో 1999లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అయితే 2004లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2009లో టిడిపి విజయావకాశాలను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రూపంలో దెబ్బతీశారు. వరుసగా టిడిపి రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడోసారి కూడా అధికారానికి దూరంగా ఉంటే.. అనే భయం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోంది. అయితే బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's Vastunne Meekosam Padayatra is reached to hundered days on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X