హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు అసద్‌తో డీలా.. ఇప్పుడు అక్బర్‌తో ఉత్సాహం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 MIM plans to strengthen party
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హిందువుల పైన, హిందూ దేవతల పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్బర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అదిలాబాదు జైలులో ఉంచారు. అంతకుముందు కూడా పలుమార్లు మజ్లస్ పార్టీ వివాదాల్లో చిక్కుకుంది. మజ్లిస్ పార్టీ అంటేనే వివాదాస్పద పార్టీగా ముద్రపడింది! అయితే తాజా వివాదం హిందూ సమాజాన్ని కించపర్చే విధంగా ఉండటంతో ఇది పెద్ద ఎత్తున దుమారం రేపింది. అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసే వరకు వెళ్లింది.

గతంలో జూనియర్ డాక్టర్ పైన ఎమ్మెల్యే చేయి చేసుకోవడం, అధికారులను బెదిరించడం వంటి పలు ఆరోపణలు మజ్లిస్ పార్టీ నేతల పైన ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మజ్లిస్ నేతల పైన పలు కేసులు నమోదయ్యాయి. అయితే వాటిని ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేదని భారతీయ జనతా పార్టీ వంటి పార్టీతో సహా పలువురి ఆరోపణ. కాంగ్రెసు పార్టీతో మజ్లిస్ పార్టీ పద్నాలుగేళ్లు జత కట్టింది.

ఇటీవలే ఆ పార్టీ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అతనిపై కేసులు పెట్టడం, అరెస్టు చేయడం వరకు వెళ్లింది. అయితే అక్బరు పైన ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యల్లో కూరుకుపోయి అరెస్టు కావడం గమనార్హం. గతంలోనూ తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మజ్లిస్ వ్యవహరించింది. అయితే ఆ తర్వాత టిడిపికి దూరమైన తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి అనుభవమే ఎదురయింది.

టిడిపి హయాంలో అసద్ అరెస్టయ్యారు. అదే రీతిలో ఇప్పుడు అక్బర్ కాంగ్రెసు హయాంలో ఆ పార్టీకి సవాల్ విసిరిన తర్వాత అరెస్టయ్యాడు. అయితే అసద్ అరెస్టు తర్వాత మజ్లిస్ పార్టీ తన దూకుడును తగ్గించింది. అదే సమయంలో ఆ పార్టీ అంతగా ప్రాచుర్యం కూడా పొందలేదు. కానీ ఇప్పుడు అక్బర్ అరెస్టును మాత్రం రాష్ట్రవ్యాప్తంగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

English summary
MIM is planning to strengthen party all over Andhra Pradesh. MIMLP Akbaruddin Owaisi in in Adilabad jail now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X