హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీన్ రివర్స్: బాబుకు మోత్కుపల్లి దూరం, విమర్శలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై శివమెత్తినట్లుగా వ్యాఖ్యల బాణాలను సంధించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విషయంలో చిత్రం ఎదురు తిరిగినట్లు కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కాపు కాస్తూ కెసిఆర్‌ను తన నోరు పెట్టుకుని ఎదుర్కున్న మోత్కుపల్లి చంద్రబాబుకు దూరమైనట్లు కనిపిస్తున్నారు.

చంద్రబాబుపై ఆయన తాజాగా విమర్శలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బ్లాక్ మెయిల్ చేసేవారిని చంద్రబాబు నెత్తికి ఎక్కించుకుంటున్నారని మోత్కుపల్లి చంద్రబాబుపై వ్యాఖ్యానించినట్లు కొన్ని తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. టీవీ చానెళ్ల వార్తాకథనాల ప్రకారం - తెలుగుదేశం పార్టీలో తనకు గౌరవమర్యాదలు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై తాను మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. గత కొంత కాలంగా చంద్రబాబుపై మోత్కుపల్లి అలిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మోత్కుపల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు పార్టీ నాయకులను మధ్యవర్తులను పంపించారు. అయితే, మోత్కుపల్లి దిగిరాలేదు. దాంతో మోత్కుపల్లిని ఆయన మానానికి ఆయనను చంద్రబాబు వదిలేసినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుంటూ కెసిఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి ఆయన దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ కార్యాచరణ విషయంలో మోత్కుపల్లి నర్సింహులు గతంలో పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుతో విభేదించారు. ఆ సమయంలో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపి, అంతర్గత ఘర్షణ తలెత్తినప్పుడు చంద్రబాబు మోత్కుపల్లిని వెనకేసుకొచ్చారని అంటారు.

English summary
According to TV channels reports - Telugudesam Telangana region MLA Motkupalli Narsimhulu has blamed party president N Chandrababu Naidu for ignoring him on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X