వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు జగన్ పార్టీలో ఉన్నాడనే: పొన్నం, కావూరి పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తన తనయుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నాడనే ఉద్దేశ్యంతోనే మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెసు పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ బుధవారం మండిపడ్డారు. తనకు మంత్రి పదవి కాగితంతో సమానమన్న కాసు ఇంకా ఎందుకు ఆ పదవిలో కొనసాగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కేంద్ర ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అన్నాడని విమర్శించారు. అలాంటి కావూరితో విజయవాడ పార్లమెంటు లగడపాటి రాజగోపాల్ చేతులు కలపడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. కావూరి వ్యాఖ్యలను సీమాంధ్ర నేతలు ఖండించక పోవడం దారుణమన్నారు.

పార్టీని విమర్శిస్తున్న కావూరిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశానని చెప్పారు. మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తెలంగాణ అంశంతో ముడిపెట్టవద్దని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు, మతంతో సంబంధం పెట్టవద్దని కోరారు.

కావూరి ఎంపి పదవిపై అనిశ్చితి

కాగా తన ఎంపీ పదవికి జనవరి 1 నుంచి రాజీనామా చేస్తున్నట్లుగా స్పీకర్‌కు రెండు నెలల కిందటే లేఖ రాసిన కావూరు సాంబశివరావు వ్యవహారంపై ఇంకా అనిశ్చితి తొలగలేదు. ఈ రాజీనామా లేఖపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, తన ముందు హాజరు కావాలని కావూరుకి సమాచారం ఇవ్వగా ఆయన డిసెంబర్ 31వ తేదీన పార్లమెంటుకు వచ్చి స్పీకర్‌తో భేటీ అయినట్లుగా సమాచారం. తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, దాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కావూరు కోరినట్లు సమాచారం. అయితే పునరాలోచించుకోవాలని ఆమె సూచించారని తెలుస్తోంది.

English summary

 Karimnagar MP Ponnam Prabhakar has lashed out at Seemandhra leaders on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X