ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్ నెం.'7546': డిన్నర్ పిఎస్‌లో, టిఫిన్ జైలులో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అదిలాబాద్: హిందువుల పైనా, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం అదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అక్బర్‌ను నిర్మల్ పోలీసులు నాలుగు గంటల పాటు పోలీసు స్టేషన్‌లో విచారించారు. దాదాపు అర్ధరాత్రి వరకు అతనిని పోలీసులు విచారించారు.

ఆ తర్వాత రాత్రంతా పోలీసు స్టేషన్‌లోనే అక్బరుద్దీన్ ఉన్నారు. పోలీసు స్టేషన్‌లోనే రాత్రి భోజనం చేశారు. అనంతరం బుధవారం ఉదయం పోలీసులు అతనిని నిర్మల్ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు అక్బరుకు రిమాండ్ విధించారు. దీంతో అక్బరును భారీ భద్రత మధ్య అదిలాబాద్ సబ్ జైలుకు తరలించారు.

తాను అనారోగ్యంతో ఉన్నానని ప్రత్యేక ఖైదీగా పరిగణించి చంచల్‌గూడ లేదా వైద్య సదుపాయాలు ఉన్న జైలుకు పంపాలని అక్బర్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అక్బరుద్దీన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించాల్సిందిగా తాము న్యాయమూర్తిని కోరామని అతని తరఫు న్యాయవాది తెలిపారు. ఈ రోజు పది గంటలకు జైలు మార్పు విషయంపై నిర్ణయాన్ని చెబుతామని చెప్పారని అక్బరు తరఫు న్యాయవాది అన్నారు.

కాగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ జిల్లా బంద్ చేపట్టనున్నట్లు మజ్లిస్ జిల్లా అధ్యక్షుడు జాబీహర్ అహ్మద్ ప్రకటించారు. బందుకు అందరూ సహకరించాలని కోరారు. నిర్మల్‌లో బిజెపి, బిజెవైఎం నేతల అరెస్టును నిరసిస్తూ బుధవారం హిందూవాహిని, విశ్వహిందూ పరిషత్ నాయకులు జిల్లా బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు చేప్టటారు. నిర్మల్‌లో 144 సెక్షన్ విధించారు.

అక్బరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్‌కు ఉదయం ఫలహారం అందించారు. అక్బరుద్దీన్ పైన మొత్తం ఏడు సెక్షన్ల క్రింత కేసు నమోదు చేశారు. అండర్ ట్రయల్ 7546 ఖైదీగా అక్బరుద్దీన్ ఉన్నారు.

English summary
MIMLP Akbaruddin Owaisi has sent to Adilabad sub jail on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X