రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య: ఆలేరులో దుర్ఘటన

అందిన సమాచారం ప్రకారం - అర్జున్‌పట్లకు చెందిన తాళ్లపల్లి నర్సమ్మ కిష్టయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కుమారుడైన తాళ్లపల్లి రాజు. అలాగే చిట్యాలకు చెందిన పంజాల లక్ష్మి, మల్లయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కాగా, పంజాల పూజ (18) చిన్న కూతురు.
రాజు పూజలు చేర్యాలలోని శ్రీవింద్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, సిద్దిపేటలోని బీఎంఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఒకేసామాజిక వర్గానికి చెందిన వీరు కలిసి చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. సిద్దిపేటలోని కళాశాలలో చదువుకుంటూ రోజు అప్ అండ్ డౌన్ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సోమవారం యథావిధిగా కళాశాలకు వెళ్లిన రాజు సాయంత్రం ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లి నర్సమ్మ దేవులాట ప్రారంభించింది. ఎవరిని అడిగినా సమాచారం దొరకలేదు.
మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే సిబ్బంది అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెండు కుటుంబాల వాళ్లు శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పొస్టుమాస్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications