భర్తపై భార్య యాసిడ్ దాడి: ప్రియురాలిపై కత్తితో దాడి

Kurnool District
కర్నూలు/విశాఖపట్నం: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య భర్త పైన యాసిడ్ దాడి చేసింది. వీరా రెడ్డి అనే వ్యక్తి నంద్యాలలో రైల్వే కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతను ఎన్టీవో కాలనీలో ఉంటున్నాడు. రాత్రి భార్యా భర్తలకు గొడవ జరిగింది. రాత్రి నిద్ర పోయిన తర్వాత భార్య యాసిడ్ తీసుకొని భర్త వీరా రెడ్డి పైన పోసింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు అతనిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. పోలీసులు రెండు కోణాలలో దర్యాఫ్తు చేస్తున్నారు. భార్యను భర్త నిత్యం ఇబ్బందులకు గురి చేసిన కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా మరికొందరు స్థానికిలు చెబుతున్నారు.

ప్రియురాలిపై కత్తితో దాడి

ఓ ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖలోని ఆంద్రా మెడికల్ కళాశాల విద్యార్థిని హైమ పైన ఆమె ప్రియుడు బుధవారం కత్తితో దాడి చేశాడు. పురుషోత్తమపురంకు చెందిన హైమ, ప్రియుడు ఆటోలో వస్తుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆగ్రహానికి గురైన అతను గోపాలపట్నం పెట్రోల్ బంక్ వద్ద ప్రియుడు కత్తితో హైమ కడుపులో పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన హైమను స్థానికులు చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+