మీడియా మొరిగే కుక్క: ఢిల్లీ రేప్ వ్యాఖ్యలపై ఆశారాం

మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు. "మొదట ఒక కుక్క మొరిగింది, ఆ తర్వాత మరో కుక్క మొరిగింది. నేను ఏనుగు లాంటివాడిని. మొరిగే కుక్కలకు భయపడను" అని ఆయన అన్నారు. ఆశారామ్ బాపు వ్యాఖ్యలు నిర్హేహుతకంగా ఉన్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆశారామ్ మానసిక స్థితిని ఈ ఘటన బయటపెడుతోందని విమర్శించారు. బాపు స్థాయి వ్యక్తులు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని జ్యోతి సోదరుడు వ్యాఖ్యానించారు.
తమకు ఆశారామ్ అంటే చాలా గౌరవం ఉండేదని, ఆశారామ్ పుస్తకాలు చాలా తమ ఇంట్లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆపుస్తకాలను తగలపెడతానని ఆయన అన్నారు.. కాగా, వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన ఆశారామ్ బాపుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ లక్నోలోని ఓ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఒక్క చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, గ్యాంగ్ రేప్ వ్యవహారంలో నిదితులది మాత్రమే కాకుండా బాధితురాలిది కూడా తప్పు ఉందని ఆయన అన్నారు. నిందితులు తాగి ఉన్నారని, సరస్వతి శ్లోకాలు చదుపుతూ గురు దీక్ష చేసి ఉంటే ఆ అమ్మాయి ఆ బస్సు ఎక్కి ఉండేది కాదని ఆయన అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications