జవాన్ల తలలు నరికి..: పాక్ సైన్యం ఘాతుకం, ఖండన

ఆ ఇద్దరు జవాన్ల తలలను నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. దీనిని భారత సైన్యం ధ్రువీకరించింది. మరో ఇద్దరిని దారుణంగా గాయపర్చారు. వారి ఆయుధాలను కూడా పాకిస్తాన్ సైనికులు వెంట తీసుకు వెళ్లారు. నార్త్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పర్నాయక్ ఘటనస్థలాన్ని సందర్శించారు. అక్కడ ఓ మృతదేహం ముక్కలు చేసి ఉన్నట్లుగా గుర్తించారు. ఓ సైనికుడి తలను వారు వెంట తీసుకు వెళ్లారు.
పాకిస్తాన్ - భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన మరో దారుణ ఘటనలో ఇది ఒకటి. పాక్ దళాలు జమ్మూకు ఉత్తరాన 220 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తుందని తాము భావిస్తున్నామని రక్షణ శాఖ రాత్రి ప్రకటించింది. ఇది పాక్ ఆర్మీ మరో దుశ్చర్య అని భారత ఆర్మీ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
దాడి చేయలేదు
భారత సైనికులపై తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, అదంతా దుష్ప్రచారమేనని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. భారత సన్యం ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications