అస్సాం దిగ్భోయ్‌లో పేలుడు: ముగ్గురు పిల్లలు మృతి

దిగ్భోయ్ పట్టణంలోని ఖర్జాన్ పూల్ ఏరియాలో జరిగిన ఈ పేలుడు కారణాలేమిటనేది తెలియదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సైనిక, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని దిగ్భంధం చేశారు.
గాయపడిన పిల్లలను ఆస్పత్రులకు తరలించారు. మిలిటెంట్ సంస్థలు ఈ పేలుడుకు ఒడిగట్టి ఉండవచ్చుననే విషయాన్ని పోలీసులు తోసిపుచ్చడం లేదు. సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
పేలుడులో అక్కడికక్కడే ఓ పిల్లవాడు మరణించగా, గాయపడిన ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అస్సాం హోం కార్యదర్శి జిడి త్రిపాఠీ చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications