ఇక ఫేస్ టు ఫేస్: మొహమాటానికి చంద్రబాబు చెక్

ఈ అంశాలపై స్పష్టత ఆలస్యం కావడం వల్ల పార్టీ ఇటీవలి కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే స్పష్టత వచ్చాక ఆయా వర్గాల నుండి మద్దతు లభించడమే కాకుండా విమర్శలు అంతగా రావడం లేదు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాల పైనా అధినేత దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పార్టీకి సంబంధించిన అంశమైనా, పార్టీయేతర అంశమైనా నిర్మోహమాటంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలనే భావనతో ఉన్నారు.
ఆ విషయాన్ని చంద్రబాబు బుధవారం స్పష్టం చేశారు. ఆయన పాదయాత్ర నిన్నటితో వందో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మాదిరిపురంలో పైలాన్ ఆవిష్కరించారు. బాబు మాట్లాడుతూ... ఇక నుండి నిర్మోహమాటంగా మాట్లాడతానని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. కేవలం తెలంగాణ, ఎస్సీ క్యాటగరైజేషన్ పైనే కాకుండా పార్టీ వ్యవహారాల్లో కూడా బాబు సీరియస్‍గానే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.
తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీ నేతలను ఆయా నియోజకవర్గాల్లో తిరగాలని సూచించారు. గ్రామాల్లోకి వెళ్లని వారికి ఆయన క్లాస్ కూడా పీకినట్లుగా వార్తలు వచ్చాయి. బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో కూడా బాబు నేతలకు ఉద్భోద చేశారు. తాను ఒక్కడిని వెళితే చూస్తూ కూర్చోరాదని, అందరూ హైదరాబాదులో కూర్చోకుండా.. ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు హితవు పలికారు. నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంటుందని హెచ్చరికలు పంపారు.












Click it and Unblock the Notifications