పనికి మాలిన, దద్దమ్మ ప్రభుత్వం: చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu
ఖమ్మం: రాష్ట్రంలో పనికిమాలిన, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రైతులు తిరగబడి హక్కులను కాపాడుకోవాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రైతులు పూర్తిగా తిరుగుబాటు చేస్తేగానీ మన హక్కులను కాపాడుకోలేమని ఆయన వ్యాఖ్యానించారు. 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు గురువారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా సమస్యలపై ఉద్యమం చేస్తున్న టీడీపీ నేతలను ఈ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లకు పంపుతోందని, ఇప్పటి వరకు 200 టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని ఆయన విరుచుకుపడ్డారు.

నగదు బదిలీ పథకంనకిలీ బదిలీ పథకంగా మారిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీదారులను కాపాడుకునేందుకే పరిమితమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బోధకాలు వ్యాధితో బాధపడేవారికి రూ. 1500 పింఛన్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు దాటిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీ తర్వాత కూడా ఆయన పాదయాత్రను కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై విమర్శలు కురిపిస్తూ, ప్రజలకు వరాల వర్షం కురిపిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+