ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడుపునొప్పని జడ్జికి చెప్పిన అక్బర్: ఎన్ఐఏకు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
అదిలాబాద్/న్యూఢిల్లీ: అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి శుక్రవారం కడుపు నొప్పి వచ్చింది. జిల్లా జడ్జి మధుసూదన్ మధ్యాహ్నం జైలును సందర్శించారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ తనకు కడుపు నొప్పి వచ్చిందని జడ్జికి తెలియజేశారు. దీంతో ఆ జడ్జి వెంటనే రిమ్స్ వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్‌కు వైద్యులు చికిత్స అందించారు. అజీర్తి కారణంగా అక్బర్‌కు కడుపు నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్యేకు అనుమతి నిరాకరణ

జైలులో ఉన్న అక్బరుద్దీన్‌ను కలిసేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం జైలు వద్దకు వచ్చారు. అయితే వారికి జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో వెనుదిరగాల్సి వచ్చింది. మజ్లిస్ ఎమ్మెల్యేలు అప్సర్ ఖాన్, ముంతాజ్‌లు వేర్వేరుగా జైలుకు వచ్చారు. అయితే అధికారులు నిరాకరించడంతో వారు అసంతృప్తితో వెనుదిరిగారు. అక్బర్‌ను కలిసేందుకు ఆయన లాయరుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు

అక్బరుద్దీన్ వ్యాఖ్యల పైన ప్రభుదాస్ అనే వ్యక్తి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. అక్బర్ అదిలాబాద్ జిల్లాలోని సభలో చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేయాలని ఆయన ఎన్ఐఏకు విజ్ఞప్తి చేశారు. అక్బరుద్దీన్ భవిష్యత్తులో బహిరంగ సభల్లో మాట్లాడకుండా నిషేధించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్బర్ పిటిషన్ వాదనలు పూర్తి

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అక్బరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న అదిలాబాద్ పోలీసుల పిటిషన్ పైన నిర్మల్ కోర్టులో శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న అక్బరుద్దీన్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 16వ తేదికి వాయిదా వేసింది.

English summary
MIMLP Akbaruddin Owaisi was suffered with stomach ache on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X