హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం ఎదుట మసాలాపాటలకు చిందేసిన అమ్మాయిలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు కూర్చున్న వేదిక వద్ద కళాశాల యువతులు ఛోలీ కే పీచే క్యా హై.. అంటూ మసాలా పాటలకు చిందేశారు. గురువారం గచ్చీబౌలీలోని జిఎంసి బాలయోగి స్టేడియం జాతీయ మహిళల(అండర్ 20) హాకీ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం, డిజిపితో పాటు మంత్రులు వట్టి వసంత్ కుమార్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇలాంటి సమయంలో కళాశాల విద్యార్థినుల మసాలా పాటల హోరుతో పరిసరాలు హోరెత్తాయి. చెవులకు చిల్లులు పడేలా డిజె సౌండ్‌తో విద్యార్థినులు బాలీవుడ్ పాటలకు చిందేశారు. ఏక్ దో, తీన్..., ఛోలీ కే పిచే క్యా హై.. పాటలతో మైదానం వూగిపోయింది. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, డిజిపిల సమక్షంలో ఇలాంటి పాటల పట్ల పలువురు పెదవి విరిచారు. ఇలాంటి అధికారిక కార్యక్రమంలో ఇలాంటి పాటలేంటని గొణుక్కున్నారు.

అయితే పలువురు దీని పట్ల రుసరుసలాడటాన్ని గుర్తించిన పలువురు అమ్మాయిలను నృత్యం ఆపాలంటూ సైగలు చేశారు. పలువురు అభ్యంతరాలను గుర్తించిన హైదరాబాద్ హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు తేజ్ దీప్ కౌర్.. సిడిలో టెక్నికల్ సమస్య వచ్చిందని.. దానిని సరిచేశాక కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలను అక్కడ నుండి పంపించి వేశారు.

English summary
College girls danced to Choli Ke Piche kyahai song before CM Kiran Kumar Reddy, DGP Dinesh Reddy and other VIPs on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X