విమానం రెక్కపై కొండచిలువ: 2గం. ప్రయాణంలో మృతి

విమానం టేకాఫ్ అయిన తర్వాత ప్రయాణీకులు విమానం రెక్క పైన ముడుచుకొని ఉన్న పైతాన్‌ను చూశారు. అంతకుముందు ఓ ప్రయాణీకుడు దానిని వేరే దగ్గర చూశాడు. కానీ పోర్ట్ మోరెస్బీ వరకు వచ్చేసరికి అది విమానం రెక్క పైనే ఉంది. అయితే అది చచ్చిపడి ఉంది.
విమానం రెండు గంటల పాటు ప్రయాణించింది. ఈ రెండు గంటల పాటు అది విమానం రెక్క పైన ఉంది. విమానం కదలికలకు, చలి గాలి, వాతావరణంలో గల మార్పులను తట్టుకోలేక అది మృతి చెంది ఉంటుందని గుర్తించారు. విమానంలో అందరు ప్రయాణీకులు ఉండగా అది ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఓ ప్రయాణీకుడు అన్నాడు.
విమానం వస్తుండగా వాతావరణ మార్పులకు తట్టుకోలేక అది మృతి చెంది ఉంటుందని మరో ప్రయాణీకుడు అన్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని అతను అన్నాడు. ఇది స్క్రబ్ పైతాన్ అని, ఉత్తర క్వీన్స్‌లాండులో ఇది కనిపించడం మామూలే అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications