అదే నిజమైతే జగన్ జైల్లో ఎందుకుంటాడు?: విజయమ్మ

YS Vijayamma
న్యూఢిల్లీ: తమ పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై ఉంటే తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు జైలులో ఉండేవాడా? సిబిఐ ఇన్ని ఛార్జీషీట్లు వేసేదా? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం అన్నారు. జగన్ విడుదలను కోరుతూ పార్టీ సేకరించిన సంతకాలను సిడి రూపంలో విజయమ్మ నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ రోజు సాయంత్రం అందజేశారు.

అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడారు. ప్రజల నుండి సేకరించిన సంతకాలకు సంబంధించిన సిడిలను తాము రాష్ట్రపతికి ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా కోరామన్నారు. వాటిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు పంపిస్తానని రాష్ట్రపతి తమకు చెప్పారన్నారు. తమకు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యే అవసరం లేదన్నారు. అదే నిజమైతే జగన్ ఇన్ని రోజులు జైలులో ఉండే వాడు కాదని, సిబిఐ అన్ని ఛార్జీషీట్లు దాఖలు చేసేది కాదని అభిప్రాయపడ్డారు.

తమకు న్యాయవ్యవస్థ పైన పూర్తిగా విశ్వాసముందన్నారు. కడపలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందని, దీనిని తెలుగుదేశం, కాంగ్రెసులు జీర్ణించుకోలేక పోయాయన్నారు. ఆ పార్టీలు పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయాయన్నారు. అందుకే కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై జగన్‌ను దెబ్బ తీయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెసు, టిడిపి, సిబిఐ కలిసి జగన్‌ను వేధిస్తున్నాయన్నారు. జగన్ విడుదలను కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేశారన్నారు. ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి అని తేలిందన్నారు. మూడు వారాల్లోనే దాదాపు రెండు కోట్ల సంతకాలు పెట్టడం విశేషమన్నారు. ఆన్ లైన్లో ఎన్నారైలు కూడా సంతకాలు చేశారన్నారు. బెయిల్ రాజ్యాంగ పరమైన హక్కు అన్నారు. జగన్ అరెస్టై ఎనిమిది నెలలు దాటినా ఇంకా బెయిల్ రాలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+