వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా రాజీనామాకి నో: తెలంగాణపై చిరంజీవి వర్గం ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణపై తమ నేత, కేంద్రమంత్రి చిరంజీవి మాటే తమ మాట అని వంగా గీత గురువారం అన్నారు. తెలంగాణపై చిరంజీవి పలుమార్లు స్పందిస్తూ... తాను తమ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని, తాము కూడా ఆయన మాటకే కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తామన్న మంత్రి గంటా శ్రీనివాస రావు అభిప్రాయంతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఆయనది వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తాము మాత్రం చిరు మాటకే కట్టుబడతామన్నారు.

చిరంజీవి తెలంగాణ అంశంపై పలుమార్లు మాట్లాడుతూ... తాను తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను సామాజిక తెలంగాణ, సమైక్యాంద్ర నిర్ణయాలు తీసుకున్నానని, ఇప్పుడు తాను కాంగ్రెసులో ఓ భాగం అని, కాబట్టి అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని చెప్పారు. చిరు వర్గంలోని పదిహేడు మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఎక్కువ మంది ఆయన మాటకే కట్టుబడి ఉండనున్నారు.

విగ్రహాలపై దాడులు జరిగినప్పుడేం చేశారు?

తెలంగాణపై 2002లో పార్లమెంటులో ప్రస్తావించిన తొలి వ్యక్తిని తానేనని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వేరుగా అన్నారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంకుబండు పైన ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని ప్రముఖుల విగ్రహాల పైన దాడులు జరిగినప్పుడు స్పందించని వారు ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ బయటకు రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

రాజీనామాలు పరిష్కారం కాదు

తెలంగాణ అంశంపై కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదని, అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తమ సమావేశం ఎవరికీ వ్యతిరేకం కాదని, సమావేశాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. తమకైతే విభజన సంకేతాలు లేవన్నారు.

English summary
Chiranjeevi camp MLA Vanga Geetha said on Thursday that they will follow Chiranjeevi orders on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X