గ్రేటర్: కెసిఆర్ సవాల్‌కు దానం రెడీ, లాయర్ల ఆందోళన

Danam Nagender
జైపూర్/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రం, విభజన అంశంపై రాజధానిలో రెఫరెండానికి తాను సిద్ధంగా ఉన్నానని కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ చింతన్ బైఠక్ కోసం జైపూర్ వచ్చిన ఆయన మీడయాతో మాట్లాడారు. హైదరాబాదులో రెఫరెండం పెడతామంటే తాను సిద్ధమే అన్నారు. రెఫరెండంతో హైదరాబాద్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందన్నారు.

విభజనపై తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. గత నెల జరిగిన అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ సహా అన్ని పార్టీలు అగ్ర కులాలకు చెందిన నాయకులనే పంపించాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెసు సహా ఏ పార్టీ బిసి నేతలను పంపించలేదన్నారు. విభజన పైన తమకు ఎలాంటి సంకేతాలు లేవన్నారు. తెలంగాణ పేరుతో సామాజిక అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మేధోమథనం ద్వారా దేశానికి ఓ దిశా నిర్దేశనం లభిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.

మేమూ రెడీ!

హైదరాబాదులో విభజనపై రెఫరెండానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు హైదరాబాదులో అన్నారు. మంత్రి దానం నాగేందర్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర నేతలు ఆధిపత్యం కోసమే ఆరాటపడుతున్నారన్నారు. వారు ఢిల్లీకి వెళ్లినా గల్లీకి వెళ్లినా తెలంగాణను ఆపలేరన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

కీలక ప్రకటన వెలువడే సమయం ఆసన్నమైనందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సీమాంధ్ర అధికార పార్టీ నేతలు తెలంగాణను ప్రభావితం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. కాంగ్రెసు ద్వంద ప్రమాణాలకు ఇది నిదర్శనమన్నారు. రేపు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాతో కాంగ్రెసు కళ్లు తెరిపిస్తామన్నారు.

దానంపై కేసులు లాయర్ల డిమాండ్

మంత్రి దానం నాగేందర్ పైన కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రాంత నాంపల్లి కోర్టు లాయర్లు డిమాండ్ చేశారు. నాగేందర్, ఆయన అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తించి న్యాయవాది పైన చేయి చేసుకున్నారని, అందుకు ఆయన పైన కేసు పెట్టి అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. దానం తీరును నిరసిస్తూ నాంపల్లి కోర్టు లాయర్లు విధులను బహిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+