అప్పటి దాకా మాట్లాడను: మీడియాకు నో అన్న లోకేష్

రసూల్‌పురా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలయ్యతో కలిసి అమరజ్యోతి ర్యాలీని లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. అలాగే లోకేష్‌ను పలకరించేందుకు మీడియా ప్రయత్నాలు చేసింది. అయితే తన తండ్రి పాదయాత్ర పూర్తయ్యే వరకు తాను మీడియాతో మాట్లాడనని నారా లోకేష్ చెప్పారు. అమరజ్యోతి ర్యాలీ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుంటుంది.
కాగా అంతకుముందు బాలకృష్ణ మాట్లాడారు. చలన చిత్ర రంగాన్ని వదులుకొని ప్రజా సేవ కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత ఆయన నిత్యం పాటించే వారన్నారు. పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను ఆయన చెపట్టారన్నారు. బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
రాజకీయాలు అందరికీ తెలిసేలా చేశారన్నారు. అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ప్రతి ఒక్కరి ఊపిరిలో ఉన్నారన్నారు. ప్రతి ఉత్తమ సిద్ధాంతంలో ఆయన కనిపిస్తారన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారన్నారు.
ఆయన రారాజులాంటి వాడన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. అవినీతిని దరిచేరనివ్వని నేత అన్నారు. ప్రజల పట్ల అంకితభావంతో పని చేశారన్నారు. ఎన్నికల గురించి ప్రశ్నిస్తే... స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల గురించి ఈ రోజు మాట్లాడటం అప్రస్తుతం అన్నారు.












Click it and Unblock the Notifications