• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనం కీలకం: ఒబామా, నాడు-నేడు ట్విట్టర్‌లో హల్‌చల్

By Srinivas
|

వాషింగ్టన్: విశ్వవ్యాప్త సంబంధాలకు మనమే కీలకమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం అన్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఒబామా సోమవారం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విశ్వవ్యాప్త బలోపేత సంబంధాలకు ఎప్పటిలాగే కీలక శక్తిగా నిలుస్తామన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ప్రసంగంలో ఆయన ఈ మేరకు ఉద్ఘాటించారు.

ఇతర దేశాలో అభిప్రాయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో సాహసోపేతంగా ముందడుగు వేస్తామని ఆత్మవిశ్వాసం ప్రకటించారు. స్వీయ ప్రయోజనాలే కాకుండా అమెరికా అంతరాత్మ కూడా స్వేచ్ఛ కోరేవారి తరఫున పోరాడాలని ప్రేరేపిస్తుందన్నారు. అందుకే ఆసియా నుంచి ఆఫ్రికాదాకా, అమెరికా నుంచి మధ్యప్రాచ్యం వరకూ ప్రజాస్వామ్యానికి మద్దతిస్తామంటూ అన్ని దేశాల వ్యవహారాల్లో వేలుపెట్టే ధోరణిని ప్రస్ఫుటంగా చాటుకున్నారు.

America will remain 'anchor of strong alliances': Obama

నాలుగేళ్ల క్రితం నల్లజాతి తొలి అధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన ఒబామా గత నవంబరులో రెండోసారి గెలుపొందారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్దేశం దృష్ట్యా ఆదివారం అధికారిక ప్రమాణం చేసినా సంప్రదాయం ప్రకారం సోమవారం ప్రజల సమక్షంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనచేత ఈ లాంఛనం పూర్తిచేయించారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ప్రమాణం వరుసగా రెండు రోజులు జరగడం ఇది ఏడోసారి.

సోమవారం ఉదయం ఒబామా, మిషెల్లీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతోపాటు సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలు చేశారు. వారితోపాటు ఉపాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, జిల్ జంట కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. సాయంత్ర ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒబామా, చీఫ్ జస్టిస్‌లను కాంగ్రెస్ సంయుక్త కమిటీ చైర్మన్, సెనేటర్ చార్లెస్ ఇ.షుమెర్ ఆహ్వానించారు.

మిషెల్లీ స్టయిలంటే ఇష్టం

ఈ వారాంతంలో అతి ముఖ్యమైన సంఘటన మిషెల్లీ కేశాలంకరణేనని, ఆమె ఎంతో బాగుంటుందని, ఎల్లప్పుడూ అందంగా ఉంటుందని, అప్పుడప్పుడూ ఆశ్చర్యంలో ముంచెత్తే స్టయిల్‌తో చాలా ఆహ్లాదపరుస్తుందని, సంభ్రమానికి గురిచేసే ఆమె చేష్టలంటే తాను చాలా ఇష్టపడతానని, ప్రేమిస్తానని తన భార్య, దేశ ప్రథమ మహిళ గురించి ఒబామా చెప్పారు. గురువారం ఆమె 49వ జన్మదిన ఫొటోలను విడుదల చేశారు.

కాగా ఒబామా నాలుగేళ్ల క్రితం2009లో ప్రమాణం చేసిన సమయంలో, ఇప్పుడు ప్రమాణం చేసిన సమయంలోని ఫోటోలు వయస్సులోని తేడాను చూపిస్తున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తున్నాయి. నాటికి నేటికి ఒబామాలోని తేడాపై కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
America will remain the anchor of strong alliances in every corner of the globe from Asia to the Middle east, US President Barack Obama on Monday said in his inaugural address after being sworn in for a second innings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more