హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'క్లైమాక్స్' 28: కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై ప్రకటనకు తేది దగ్గరపడుతున్నా కొద్దీ అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 28 ఫీవర్ పట్టుకుంది. 28 లేదా ఆ లోగా తెలంగాణపై ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు, నాయకులు ఆసక్తిగా ప్రతి పరిణామాన్ని గమనిస్తున్నారు. ఏ రోజు ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అనే ఉత్కంఠలో అందరూ ఉన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూడా ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీ అవుతూ తమ తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.

మరోవైపు ఏ ప్రాంతానికి చెందిన నేతలు తమను కలిసినా కాంగ్రెసు పార్టీ పెద్దలు, కేంద్రమంత్రులు మౌనంగానే ఉంటున్నారు. విభజనకు అనుకూలంగా తెలంగాణ నేతలు ప్రశ్నించినా, సమైక్యం గురించి సీమాంధ్ర నేతలు అడిగినా నేతలు ఏమాత్రం స్పందించడం లేదు. కేవలం ఇరువైపుల నేతల అభిప్రాయాలని, డిమాండ్లను మాత్రమే వారు తీసుకుంటున్నారు. వారి మొహంలో కానీ, మాటల్లో కానీ కేంద్రం తీసుకునే నిర్ణయంపై కించిత్తు కూడా కనిపించడం లేదు.

గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరా తదితర నేతలను సీమాంధ్ర, తెలంగాణ నేతలు వరుసగా కలుస్తున్నారు. ప్రకటన చేసే వరకు ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు నేతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆజాద్, వాయలార్ రవిలు ఈ రోజు సాయంత్రం సోనియాతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

తెలంగాణ ప్రకటనపై గడువు దగ్గర పడుతుండటంతో సోనియా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేంద్రం.. ప్రకటన ఎలా చేయాలి? ఎప్పుడు చెయ్యాలి? అనే తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

పార్టీపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెసు నేతలకు ఆజాద్ మంగళవారం సూచించారు. సీమాంధ్రలో తెలంగాణ నేతలకు, తెలంగాణలో సీమాంధ్ర నేతలకు బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

28లోగా ప్రకటన ఉంటుందో లేదో తెలియదని వాయలార్ రవి చెప్పారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

సీమాంధ్ర నేతలు రాష్ట్రాన్ని యథావిధిగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

కెసిఆర్ వ్యాఖ్యలు నిజమవుతాయా అనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

తెలంగాణ కోసం సీమాంధ్ర నేతల ఎడతెగని ప్రయత్నం.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

తెలంగాణ వస్తుందన్న విశ్వాసం పాల్వాయి వ్యక్తం చేశారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

సుశీల్ కుమార్ షిండే అధ్యక్షురాలు సోనియాతో బుధవారం భేటీ తెలంగాణపై చర్చించారు. సీమాంధ్ర, తెలంగాణ నేతల డిమాండ్లు, విజ్ఞప్తులు ఆమె ముందు ఉంచారు.

కెసిఆర్ చెప్పిందే జరగనుందా?(ఫోటోలు)

కేంద్రం నుండి ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో హైదరాబాదుకు ప్రత్యేక పోలీసు బలగాలని కేంద్రం తరలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ప్రకటన ఎలాంటి ప్రకటన వచ్చినా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పోలీసులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

వారి తీరు చూస్తుంటే కేంద్రం నుండి ప్రకటన వచ్చే వరకు ఇంత సున్నితమైన అంశం గురించి ఎవరికీ తమ నిర్ణయం తెలియకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణ నేతలు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. ఓ ప్రాంతం వారికి అనుకూలంగా నేతలు స్పందించడం లేదని భావిస్తుండగానే మరో ప్రాంతం వారికి కూడా అలాంటి ఝలక్ తగులుతోంది. అంటే ఏ ప్రాంతంకు అనుకూలంగా, వ్యతిరేకంగా వారు సంకేతాలు ఇచ్చే విధంగా కనిపించడం లేదు.

తెలంగాణకు వ్యతిరేకంగానేనా...!?

నాలుగు రోజుల క్రితం కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే రెండు రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనే ఆందోళన వెలిబుచ్చిన మంత్రి టిజి వెంకటేష్ తాజాగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశాలు నూటికి నూరుపాళ్లు కనిపించడం లేదంటున్నారు.

నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ ఈ రోజు మాట్లాడుతూ.. కేంద్రం సీమాంధ్ర నేతలు ఒత్తిడికి తలొగ్గేలా కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కేంద్రానికి సమర్పించిన నివేదికలో తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నట్లుగా జాతీయ పత్రికలో వచ్చింది. మూడు రోజుల క్రితం తెలంగాణ వస్తుందని ఎంతగా ప్రచారం జరిగిందో ఇప్పుడు అంత వ్యతిరేకంగా కనిపిస్తోంది.

కేంద్రమంత్రి వాయలార్ వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 28లోపు ప్రకటన ఖచ్చితంగా వెలువడుతుందో లేదో చెప్పలేనని అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో డిసెంబర్ నాటికి పార్టీని సెట్ చేస్తానని, ఆంధ్రా ప్రాంతం వారికి తెలంగాణలో, తెలంగాణ నేతలకు సీమాంధ్రలో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారట. ఇవన్నీ చూస్తుంటే కెసిఆర్ చెప్పినట్లుగా అఖిల పక్ష సమావేశం ఓ జోక్ అవుతుందా అనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది.

మరోవైపు సీమాంధ్రలోనూ అందుకు భిన్నంగా పరిస్థితులు ఏమీ లేవు. నాలుగు రోజుల కంటే సీమాంధ్ర నేతల పరిస్థితి కొంచెం మెరుగ్గా కనిపించినప్పటికీ ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో తెలియక వారు సతమతమవుతున్నారు. ఇరు ప్రాంతాల్లో జెఏసిలు అప్పుడే కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. అంతిమంగా కేంద్రం తెలంగాణకు ఫుల్ స్టాప్ పెట్టే నిర్ణయం తీసుకోక పోవచ్చునని, ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదా తదితరాలు ఉండవచ్చునని అంటున్నారు. అయితే సోనియాను కలిసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాత్రం తెలంగాణ వస్తుందన్న విశ్వాసం వెలిబుచ్చారు.

English summary
Is the Centre soon going to make an announcement stating that it needs more time to decide on the Telangana issue? According to sources, the Congress Core Committee, which met thrice on the issue, could not come to any conclusion as conflicting views were expressed by its members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X