నెల రోజులంటే నెలేనా?: ఆజాద్, తెలంగాణ వాయిదా

తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారని, అలా అంటే నెల అంటే నెల రోజులే కాదన్నారు. పది రోజులు అటు ఇటు కూడా పట్టవచ్చునని చెప్పారు. ఏదైనా అంశం వారంలో తేల్చేస్తామంటే ఏడు రోజుల్లోనే తేల్చుతామని కాదని పదిహేను రోజులు కూడా పట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 28వ తేదీయే కాకుండా కొద్ది రోజులు అటు ఇటు కావొచ్చన్నారు.
జాతీయస్థాయిలో తెలంగాణపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తీవ్రంగా చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నారు. మీడియా అడిగినంత సులభంగా తెలంగాణపై నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని అన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయని చెప్పారు. చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సోనియాతో చర్చించిన అంశాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
ఆజాద్ వ్యాఖ్లతో తెలంగాణ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వారు ఆజాద్ మాటలు కాకుండా ఈ నెల 28వ ప్రకటన చేస్తామన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనపై ఆశలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణవాదులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications