వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు షాక్: కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కెసిఆర్ ఆహ్వానం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు(మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)లు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఉదయం మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రచారం మరింత ఎక్కువయింది. అవసరమైతే తెరాసలోకి వెళ్తామని గతంలో కోమటిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాకపోయినా కెసిఆర్‌తో చర్చించిన మీదట కొద్ది రోజుల తర్వాతనైనా తెరాలకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కోమటిరెడ్డి సోదరులు మొదటి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. వారి మాటలు కూడా జగన్ పార్టీలోకి వెళ్లేటట్లుగానే కనిపించేవి. కాంగ్రెసులో ఉన్న వారు జగన్‌కు మద్దతుగా మాట్లాడుతుంటారు. దీంతో నల్గొండ జిల్లా కాంగ్రెసు నేతలు కూడా వారు ఎప్పటకైనా జగన్ పార్టీలోకి వెళ్లే వారే అనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా వీరు జగన్‌కు ఝలక్ ఇచ్చి తెరాసలో చేరేందుకు నెల రోజులుగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు కెసిఆర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఏ క్షణంలోనైనా తెరాసలోకి వెళ్తామనే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాగా కోమటిరెడ్డి సోదరులు నెల రోజుల క్రితమే యూ టర్న్ తీసుకున్నారని చెప్పవచ్చు. జగన్ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన వారికి అఖిల పక్షం ముందు వరకు ఉండేదని అంటున్నారు. అఖిల పక్ష సమావేశం తర్వాత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు. నెల రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి. తాను జగన్ పార్టీలోకి వెళ్లనని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తానని జరిగే ప్రచారం అంతా ఉత్తిదే అన్నారు.

Komatireddy Venkat Reddy-K Chandrasekhar Rao-YS Jagan

తాను కొండా లక్ష్మణ్ బాపూజీ దారిలో స్వతంత్ర తరహాలో ఉద్యమిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమిస్తానన్నారు. తెలంగాణ కోసం పార్టీ మారాల్సిన పరిస్థితే వస్తే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తానే కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Former Minister Komatireddy Venkat Reddy was met Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao on Friday morning. It is said that he and his brother Rajagopal Reddy may join in TRS any time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X