ఆజాద్‌పై దుమ్మెత్తిపోసిన ఈటెల, అడ్డుకాదు:నన్నపనేని

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కట్టుకథలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. తెలంగాణపై ప్రకటన ఇప్పట్లో రాదని ఆజాద్ చెప్పిన తర్వాత ఇంకా వేచి చూడాలని చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెసు నీడలో ఉండి తెలంగాణలో అడుగుపెడితే తెలంగాణ ప్రజలు ఆ పార్టీ నేతలకు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీని నిషేధించే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు.
లగడపాటి, కావూరిల అక్రమ సంపాదన బయటపెడతాం
ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, కెవిపి రామచంద్ర రావుల అక్రమ సంపాదనను బయటపెడతామన్నారు. లగడపాటి, కావూరిలాంటి వారు ఇక్కడ డబ్బులు సంపాదించి తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. దోచుకున్న సొమ్ముతో అడ్డుకుంటున్నారన్నారు. వారిని జైలుకు పంపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ నెల 27న భేటీ అయి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దోపిడికి పాల్పడి తెలంగాణ అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతల భరతం పడతామన్నారు. సహకార, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.
తెలంగాణకు అడ్డు కాదు
తాము తెలంగాణకు అడ్డుకాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి వేరుగా అన్నారు. రాష్ట్రాన్ని విభజించే ముందు తమ హక్కులు తేల్చాలన్నారు. విభజనకు హైదరాబాదే పెద్ద సమస్య అన్నారు. ఆంధ్రావాళ్ల అంతు చూస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల కంటే హరీష్ వ్యాఖ్యలే తీవ్రమైనవన్నారు.












Click it and Unblock the Notifications