ఉండవల్లీ, లగడపాటీ! కుట్రలు ఆపండి: బైరెడ్డి సూచన

Byreddy Rajasekhar Reddy
హైదరాబాద్: "ఉండవల్లీ, లగడపాటీ! ఇక కుట్రలు ఆపండి, రాయపాటీ ఇక చాలు" అని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. తెలంగాణ విడిపోతే కలిసి ఉందామనే వారి మాటలకు అర్థం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. రాజమండ్రికి తామంతా వస్తామని అనుకోవద్దని ఆయన రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు.

ఏ ప్రాంతంతోనూ తాము కలిసి ఉండబోమని ఆయన అన్నారు. తాము బానిస బతుకులు బతకడానికి సిద్ధంగా లేమని, తాము ఆంధ్రులతో కలిసి ఉండడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి సభ కుట్రపూరితమైందని ఆయన విమర్శించారు. రాజమండ్రి సభలో రాయలసీమ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని అడిగారు. తెలంగాణ విడిపోతే రాయలసీమను కలిపి ఉంచుకుందామని ఆంధ్ర నేతలు అనుకుంటున్నారని, తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ హీరో, విలన్, వ్యాంప్ పాత్రలను పోషిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య అభిప్రాయ బేధాలున్నాయే తప్పప్రజలంతా కలిసి కట్టుగా ఉన్నారని కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందని తాను భావించడం లేదని గాదె వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విభించాల్సి వస్తే ఐదు భాగాలుగా చేయాల్సి వస్తుందని ఏలూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజమండ్రి సభకు వెళ్లడంలో తప్పేమీ లేదని మాజీ మంత్రి, రాయలసీమకు చెందిన కాంగ్రెసు శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణ ఇస్తే తప్పేమిటని బొత్స అన్నారని, బొత్స వైఖరిని ఆయననే అడగాలని జెసి అన్నారు. తెలంగాణ మాటల కారణంగానే ఉండవల్లి అలా అనాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+