వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉండవల్లి కాదు ఊసరవెల్లి, అప్పుడేమైంది: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్ : ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించేలా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీశ్‌రావు విమర్శించారు. ఏ రోటికాడ ఆ మాట చెప్పి ఉండవల్లి ఊసరవెల్లి అనిపించుకున్నాడని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం అవసరం లేదని అన్నారు.

1972లో జై ఆంధ్రా, ఆ తర్వాత రెండు ప్రాంతాలు, ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ ఉండవల్లి ఊసరవెల్లిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా గులాబీ జెండా వేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చినప్పుడు ఆమె మాటలను తెలుగులోకి అనువాదం చేసిన ఉండవల్లికి ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని అడిగారు.

2004 ఎన్నికల్లో తెలంగాణ కోసం ఏర్పాటైన తమ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన అడిగారు. తెలంగాణలో దోపిడీ చేయడం ముమ్మాటికీ నిజమేనన్నారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అన్న ఉండవల్లి మాటలను ప్రస్తావిస్తూ 'నీలాంటి వారికి విషం చిమ్మడమెరుగు' అన్నారు. తెలంగాణలో విద్యుత్ వాడకం ఎక్కువని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టును తెలంగాణ ఉద్యోగ సంఘాలు సవాలు చేశారని గుర్తుచేశారు.

ఉండవల్లి సభలో ఒక్క మాటైనా జగన్ గురించి గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి గానీ మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నా, అప్పుడు ఎందరో అమాయకులు చనిపోయినా వారు చావలేదని ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించారు. ప్రాంతాల వారీగా విడిపోయి, ప్రజలుగా కలిసి ఉందామన్నారు. ఉండవల్లి చెప్పినవన్నీ అవాస్తవాలని ఏ చర్చా వేదికపైనైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు అన్నారు.

English summary

 Telangana Rastra Samithi (TRS) MLA Harish Rao has retaliated Congress Seemandhra MP Undavalli Arun kumar's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X