వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి జగన్ కోవర్టు: యాష్కీ, కెసిఆర్‌తో ఏమిటి: సుధీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
మెదక్/ హైదరాబాద్/ వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీకి కోవర్టుగా తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పని చేస్తూ తెలంగాణను అడ్డుకున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. ఇలాంటి వారిని కట్టడి చేయకుంటే తెలంగాణను అడ్డుకుంటారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలం, కర్నాల్‌పల్లిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయ వ్యాపారం చేస్తున్న కెవిపి బృందం రాష్ట్ర ఏర్పాటును ఆపలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియా, రాహుల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బెదిరింపులపై, విద్వేషపూరిత వ్యాఖ్యలపై అధికార కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ వద్ద అంత సమాచారం ఉంటే ఆయనను ఎందుకు అరెస్టు చేయించడం లేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ప్రశ్నించారు. లోపాయికారి సంబంధాలు ఉండడం వల్లనే మౌనంగా ఉంటున్నారా? మజ్లిస్ పార్టీలాగా పూర్తిగా తెగతెంపులు అయితేనే పట్టించుకొని అరెస్టులు చేస్తారా అని వ్యాఖ్యానించారు.

తెరాస అధినేత కెసిఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్, శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే తెరాస తహతహలాడుతోందని ఆరోపించారు. 2014 ఎన్నికల వరకు తెలంగాణ రాకుండా అడ్డుకొని సెంటిమెంటును ఉపయోగించి ఓట్లు, సీట్లు సంపాదించాలని తెరాస ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌తో తెరాస కుమ్మక్కైందని ఆరోపించారు.

ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఉండవల్లి నీతిలేని ఉపన్యాసం ఇస్తారా? తెరాస నాయకుడు నాయని నరసింహారెడ్డి అన్నారు. కెసిఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న ఉండవల్లి తమనింకా బానిసలుగా బతకమంటారా? అని ప్రశ్నించారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందనే ఆందోళనతో ఈ విమర్శలకు దిగారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నేతల మద్దతు అక్కర్లేదన్నారు. ఉండవల్లి మాటలు అసత్యాలని సీమాంధ్ర ప్రజలే ఫోన్లు చేసి తమకు చెప్తున్నారన్నారు.

English summary

 Congress Nizamabad MP Madhu Yashki has saif that Rajyasabha member KVP Ramachandar Rao is acting as covert to YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X