వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాదయాత్రకు షర్మిల రెడీ: ఫిబ్రవరిలోనే శ్రీకారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తిరిగి పాదయాత్ర చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. మధ్యలో వదిలేసిన పాదయాత్రను ఆమె ఫిబ్రవరి మొదటి వారంలో తిరిగి కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగత ఫిజిషియన్ చెప్పారు. శనివారం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల తర్వాత షర్మిల పాదయాత్రపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిరుడు డిసెంబర్ 18వ తేదీన బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె కుడికాలికి దెబ్బ తగిలింది. ఆమె 3 వేల కిలోమీటర్లు నడిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, కాలి నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో ఆమె మధ్యలో పాదయాత్ర ఆపాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన వివాదం చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె పాదయాత్రకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు.

ఫిబ్రవరిలో పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని షర్మిల తమకు చెప్పినట్లు వైద్యుడు డాక్టర్ రఘువీర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కిలోమీటర్లలో 82 2కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైయస్ జగన్ జైలుకు వెళ్లడంతో నిరుడు అక్టోబర్‌ నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.

ఆమె నడకను సాధన చేస్తున్నారని, క్రష్ లేకుండా నడవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. నిజానికి పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండున్నర నెలలు పడుతుందని, షర్మిల అత్మస్థయిర్యం కారణంగా త్వరగా కోలుకున్నారని డాక్టర్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నెలన్నర క్రితం ఆమె పాదయాత్ర నిలిచిపోయింది.

English summary

 Nearly one and half months after suffering a ligament tear on her right leg, Sharmila, sister of the jailed YSR Congress chief Jaganmohan Reddy, will resume her padayatra early in February, her personal physicians said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X