జగన్‌పై సభకు ఎందుకు అడగరు: బొత్సకు విహెచ్ ప్రశ్న

V Hanumanth Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా సభ పెట్టాలని ఎందుకు అడగరని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అడిగారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన సభకు బొత్స వెళ్లడాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. రాజమండ్రి సభకు వెళ్లే విధంగా బొత్సను ఎవరు పురిగొల్పారని ఆయన అడిగారు.

ముఖ్యమంత్రికి, పిసిసి కార్యవర్గానికి చెప్పి బొత్స ఆ సభకు వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. రెండు ప్రాంతాల సదస్సులకు బొత్స హాజరయ్యేందుకు ఇదేమైనా బొమ్మలాటనా అని ఆయన అన్నారు. రాజమండ్రి సభకు హాజరైన బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా అనర్హుడని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ కెఆర్ అమోస్ అన్నారు. పిసిసి పదవికి బొత్స తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బొత్స సత్యనారాయణ పిసిసికి అధ్యక్షుడా, ఆంధ్రకు అధ్యక్షుడా అని ఆయన అడిగారు.

సమైక్యాంధ్ర సభకు ఎందుకు వెళ్లారో బొత్స వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమండ్రి సభ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రి సభకు తమ పార్టీ అధిష్టానం ప్రోత్సాహం ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చే సమయంలో రాజమండ్రి సభకు బొత్స వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు.

రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని అనడం అంబేడ్కర్ ఆశయాలను అవమానపరచడమేనని ఆయన అన్నారు.

సీమాంధ్ర పాలన నుంచి విముక్కి పొందాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి దశలో ఉన్నప్పుడు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. వేయి మంది అమరులైనప్పుడు స్పందించకుండా ఉండవల్లి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని వివేక్ అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+