బాబు పాదయాత్రలో భార్య భువనేశ్వరి, నారా లోకేష్

పాదయాత్రకు విరామం ఇవ్వాలని కోరామని, అయితే చంద్రబాబు అంగీకరించలేదని భువనేశ్వరి మీడియాతో అన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని చంద్రబాబు చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రాబాబు మానసికంగా బలంగా ఉన్నారని, నడుము, కాలినొప్ప చంద్రబాబుకు తాత్కాలికమే అని ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ తెలిపారు.
అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే పార్టీ ధ్యేయమని, దీనిపై పోరాడేందుకు యువత ముందుకు రావాలని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు 64వ గణంతత్య్ర దినోత్సవం సందర్భంగా కంచికచర్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి వల్ల పేదలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని ధ్వజమెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టను వ్యాపింపజేసిన ఘనత తమ పార్టీదేనని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి సంస్కరణల్లో తమ పార్టీ ముద్ర ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, ఇందుకు కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ప్రకటించారు. అసెంబ్లీ తొలి సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవినీతిపరులు ఎందటి వారినైనా వదలమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక పోరాటం జరిపితేనే అవినీతి అంతమవుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications