వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోరు పారేసుకుంటున్నారు, షిండేకేం తెలుసు: సబ్బం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
శ్రీకాకుళం: రాష్ట్ర విభజనపై అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు, అహ్మద్‌పటేల్‌కు ఏం తెలుసునని కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ప్రశ్నించారు. కాంగ్రెసులోనే ఉంటూ ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొమరాడలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెసు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం పూర్తిగా తెలుసుకొని ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్చలు చేపట్టి రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణ ఇవ్వాల్సి వస్తే హైదరాబాద్‌లేని తెలంగాణ మాత్రమే ఇచ్చే అవకాశం ఉండొచ్చని, దానికి కూడా కొంతకాలం పట్టవచ్చునని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. అయితే తెలంగాణ ఇప్పట్లో రాదని ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్నారు. సీమాంధ్ర నాయకులపై తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆయన తప్పు పట్టారు. మధు యాష్కీ జాగ్రత్తగా మాట్లాడాలని రాయపాటి హెచ్చరించారు.

కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నాయని, యాష్కీ పార్టీకే పెద్ద సమస్యగా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రతిసారి పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మధు యాష్కీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన శుక్రవారం హైదరాబాదులో డిమాండ్ చేశారు.

'మీ ఇష్టం వచ్చినట్లు ర్రాష్టాన్ని ము క్కలు చేయాలనుకోవడం కాదు. అలా చేయాలనుకుంటే ఏయే ప్రాంతాలకు ఏయే సౌకర్యాలు కల్పిస్తారో, ఎక్కడ కల్పిస్తారో లెక్క చెప్పండి. ఆ తర్వాతే చేయాల్సిందేదో చేసుకోండి. అంతే తప్ప మా హక్కులు కాలరాసేలా ఏ చర్యలు తీసుకున్నా చూస్తూ మాత్రం ఊరుకోం' అని తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ను, బంజారాహిల్స్‌ను ఉన్న ఆంధ్రావాళ్లను అడ్డగుట్ట వాళ్లు చూసుకుంటారన్న హరీశ్‌రావును అరెస్టు చేయాలని ఆమె అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan supporter and Congress MP Sabbam Hari has questioned the credintials of the union home minister Sushil kumar Shinde on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X