వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమరదీక్ష: కాంగ్రెసు ఎంపీలపై దాడికి యత్నం, టెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

attempt to attack Congress MPs
హైదరాబాద్: తెలంగాణ కోసం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జెఎసి చేపట్టిన సమరదీక్ష స్థలి వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. సమరదీక్షకు వచ్చిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, జి. వివేక్, నేత కె. కేశవరావులపై దాడికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. రాజీనామా చేసిన తర్వాతనే రావాలని వారు డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్న కేశవరావు, పొన్నం ప్రభాకర్‌ల కార్ల అద్దాలు ధ్వంసం చేసి చుట్టుముట్టారు. పార్టీ, పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

వేదిక ఎక్కవద్దంటూ కొందరు నిరసన తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యేలు కెటి రామారావు, హరీష్ రావు, జేఏసీ ఛైర్మన్ కోదండరాం తదితరులు ఆందోళనకారులను శాంతిపంచేశారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సరైందికాదని కేటిఆర్ అన్నారు. అడ్డుకోవాల్సిన వారు కాంగ్రెస్‌లో చాలా మంది ఉన్నారని అన్నారు.

దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వీరిపై దాడి చేయకూడదని, తెలంగాణ కోటాలో ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్, ఇతర మంత్రి పదవులు పొందిన వారిని అడ్డుకోవాలని కెటిఆర్ అన్నారు. వారికి మాట్లాడడానికి అవకాశమిచ్చి, ఏం చెబుతారో విన్నతర్వాత స్పందిద్దామని చెబుతూ ఎంపి పొన్నం ప్రభాకర్‌కు మైక్ ఇచ్చారు. తాము కాంగ్రెస్ నేతలుగా రాలేదని, తెలంగాణ బిడ్డలుగా దీక్షకు సంఘీభావం తెలియజేయడానికే ఇక్కడకు వచ్చామని పొన్నం చెప్పారు. తమకు తెలంగాణ కంటే ఎక్కువ ఏదీ లేదని, అవసరమైతే, కాంగ్రెస్‌కు, ఇతర పదవులకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు.

సోనియా గాంధీని కూడా తాము ఎదిరించామని ఆయన అన్నారు. సంగారెడ్డి వెళ్లి జగ్గారెడ్డిని నిలదీయాలని ఆయన సూచించారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే విప్ అవుతాడని విజయవాడలో లగడపాటికి ఇద్దరు ముగ్గురు పెళ్లాలు ఉండొచ్చుకానీ రెండు రాష్ట్రాలు ఉంటే త ప్పొచ్చిందా? తెలంగాణ గొంతును మేం ఢిల్లీలో వినిపిస్తామని ఆయన అన్నారు.

తమ పదవులను తెలంగాణ సాధనకు ఉపయోగిస్తాం. తమ రాజకీయ విధానం ప్రకారం మేం ఉద్యమిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ద్రోహులున్నారని వివేక్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కావాలని చెప్పి ఇంట్లో కూర్చున్న వారిని ఉద్యమంలోకి తీసుకు రావాలని అన్నారు. ఉద్యమకారుల్లో ఒకడిగా పోరాడుతానని కె. కేశవరావు చెప్పారు. ప్రధాన మంత్రి దగ్గర సోనియా కుర్చున్నప్పుడే మన ఎంపీలు నిరసన తెలిపారు.

English summary
Telanganites tried to attack Congress MPs Ponnam Prabhakar and G Vivek at Telangana Samara deeksha. They were pacified by TRS MLAs Harish Rao and KT Ramarao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X