వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వాయిదా: ఆజాద్ వర్సెస్ షిండే, చిద్దూ వంత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Azad - Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానంలోనే విభేదాలు వచ్చాయట. తెలంగాణపై నెలలో తేల్చేస్తామన్న ప్రకటనపై సీనియర్ల మధ్య విభేదాలు పొడసూపి వాగ్వాదం వరకు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత నెల అఖిల పక్ష సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ నెలలో పరిష్కరిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన అదే చెప్పారు. తెలంగాణపై ఇటీవల కోర్ కమిటీ తీవ్రంగా చర్చిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నెల వాయిదా పైన సుశీల్ కుమార్ షిండే, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మధ్య వాగ్వాదం జరిగిందట. కోర్ కమిటీలో వీరి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. షిండే నెల వాయిదా ప్రకటనతో తెలంగాణపై అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చేసిందని, దీనిని ఎలా అమలు చేయాలన్నదాని పైనే చర్చలు జరుగుతున్నాయని రెండు వారాల క్రితం వరకు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

సీమాంధ్ర నేతలు ఢిల్లీలో మోహరించి అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ నేతలూ పోటీగా ఢిల్లీలో మకాం వేశారు. దీంతో దేశ రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధిష్ఠానాన్ని గందరగోళంలో పడవేసింది. ఈ పరిస్థితుల్లో గులాంనబీ ఆజాద్ బుధవారం మీడియా ముందుకు వచ్చి నెల అంటే నెల కాదని చెప్పారు. ఆజాద్ ప్రకటనపై షిండే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. కోర్ కమిటీ సమావేశంలో షిండేకు, ఆజాద్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది.

హోంమంత్రిగా తాను చేసిన ప్రకటనను అపహాస్యం చేస్తూ మాట్లాడడం సరికాదని, పార్టీ పరంగా జరుగుతున్న విషయాన్ని మీరు చెప్పండని, హోంమంత్రిగా తాను చేసిన ప్రకటనను మీరెలా నీరుగారుస్తారని షిండే ప్రశ్నించారట. ఆయనను చిదంబరం కూడా సమర్థించారట. అయితే షిండే నెల రోజుల గడువును పలువురు ఇతర నేతలు కూడా తప్పుపట్టినట్లుగానే ఇప్పటికే ప్రచారం జరిగింది. షిండే, ఆజాద్‌ల మధ్య వాగ్వాదాన్ని అహ్మద్ పటేల్ చల్లార్చారట.

English summary
Differences took over Telangana between Central Home Minister Sushil Kumar Shinde and State Congress Incharge Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X